తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.

హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి సవాల్ విసిరిన యాంకర్ సుమ!

ఇందులో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్; సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన భాను శ్రీ గారు ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా భాను శ్రీ గారు మాట్లాడుతూ మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు.  రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని.. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మరొక ఐదుగురిని సినిమా హీరోయిన్ MLA రోజా, నటి ప్రియా, జబర్దస్త్ చమ్మక్ చంద్ర, జబర్దస్త్ గెటప్ శీను, జబర్దస్త్ అవినాష్ లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ; కిషోర్ పాల్గొన్నారు.