తెలుగమ్మాయి అయినప్పటికీ హాట్ గ్లామర్ షోతో అప్పుడపుడు హీటెక్కించే తేజస్విని మాదివాడ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచే పాత్రలో కనిపించనుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అడల్ట్ వెబ్ సిరీస్ తో బేబీ సరికొత్త గ్లామర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గతకొంత కాలంగా తేజస్విని సితార్ యాక్టర్ గా క్రేజ్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఐస్ క్రీమ్ సినిమాలో ఫుల్ గ్లామర్ షోతో రెచ్చగొట్టినప్పటికీ అమ్మడికి సరైన అవకాశాలు అందలేదు. గ్లామర్ తో కాకుండా నటనాపరంగా తేజస్విని నీరుపించుకుంటే ఛాన్స్ లు అందుకోవచ్చని కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు గ్లామర్ ని ప్రజెంట్ చేస్తూనే ఎమోషన్ తో కూడిన సీన్స్ తో ఆకర్షించేందుకు అమ్మడు సిద్ధమవుతోంది.

ఈ వెబ్ సిరీస్ లో సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కి సంబందించిన సీన్స్ ఉంటాయట. వైరల్ అయిన #Metoo బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ గట్టిగా ఉంటాయని తెలుస్తోంది.  హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ తేజస్వినికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.