ఎమోషనల్ గా మాయమాటలు చెప్పి తనను వాడుకున్నాడని నటీమణి రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రష్మీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. షోలో ఫైనల్ వరకు చేరుకునున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని విధంగా మాజీ బాయ్ ఫ్రెండ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటుడు అర్హన్ ఖాన్ కూడా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తో బెస్ట్ జోడి అనిపించుకున్న ఈ జంట బయటకు వచ్చిన తరువాత విడిపోయారు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్హన్ గురించి మాట్లాడిన రష్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  రష్మీ మాట్లాడుతూ.. 'అర్హన్ కోసమే నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్ గా వెళ్ళాను. షోలో ఉన్నపుడు నా గురించి అతను చెప్పిన విషయాలన్నీ అబద్దాలే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసినట్లు చెప్పడం అంతా అబద్ధమే.

ఓ విధంగా అతనికే నేను చాలా విధాలుగా సహాయపడ్డాను. నను చాలా సార్లు అర్హన్ ఎమోషన్ గా వాడుకున్నాడు. అయినా కూడా ఎక్కడ అతని గురించి నేను బ్యాడ్ గా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక అతని గురించి ఎన్నో నమ్మలేని నిజాలు తెలుసుకున్నాను. అతనికి ఇదివరకే పెళ్లయ్యింది పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నాను. అతను నా జీవితంలో ముగిసిన ఒక అధ్యాయం. ఇక తన గురించి ఎక్కువగా ఆలోచించను' అని రష్మీ వివరణ ఇచ్చింది.