బిగ్ బాస్ సీజన్ 3 పదకొండవ వారం పూర్తి చేసుకోనుంది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ బయటకి వెళ్లనున్నారు.

శనివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. 'బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్' టాస్క్ లో వితికా ఆడిన తీరుని విమర్శిస్తూ నాగార్జున కొన్ని కామెంట్స్ చేశారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్, వితికా గేమ్ ఆడగా.. బాబాని రిక్షా నుండి తోసేసి వితికా విజేతగా నిలిచింది.

అయితే ఈ విషయంలో చాలా మంది వితికాను విమర్శించారు. కానీ వితికా మాత్రం తనను తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది. ఇక శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో సంబరాలు జరిగాయి. బాటిల్ ఆఫ్ ది మెడాలియన్ టాస్క్‌లో విజేతగా నిలిచిన వితికా వచ్చే నాలుగు వారాలు నామినేషన్స్ లో ఉండదు.

అంటే ఫినాలేకి ఆమె నేరుగా బెర్త్ ఫైనల్ చేసుకున్నట్లే.. గేమ్ లో గెలిచిన వితికాకి మెడల్ ఇచ్చి సత్కరించారు. బాబా భాస్కర్ చేతుల మీదుగా ఆమె మెడల్ అందుకుంది. వితికా మెడల్ గెలవడంతో బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు నిర్వహించారు.