ఈ వారం ఎలిమినేషన్ కోసం హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో మంగళవారం ఎపిసోడ్ లో కూడా ఆ హీట్ కంటిన్యూ అయింది. హౌస్ మేట్స్ అందరూ నామినేట్ కావడానికి కారణమైన వరుణ్, శివజ్యోతిలు ఈ ఎపిసోడ్ లో కూడా వాదించుకున్నారు. వరుణ్ తన మాటల మధ్యలో శివజ్యోతిని కంత్రి ఆటలు ఆడకు అన్నాడు.

ఆ విషయం గుర్తు చేసుకున్న శివజ్యోతి.. వరుణ్ తనను అన్నేసి మాటలు అంటున్నా తను ఒక్క మాట కూడా మిస్ యూజ్ చేయలేదని బాబా భాస్కర్, శ్రీముఖిల దగ్గర చెప్పుకొని బాధ పడింది శివజ్యోతి. ఇంతలో వరుణ్.. శివజ్యోతి దగ్గరకి వచ్చి.. 'నువ్ నన్ను అనలేదా..? నేను బతకకపోతే అందరికీ ముంచేయాలనే యాటిట్యూడ్ నీది.. ఇది ఎంత బ్యాడ్' అంటూ గొడవని మరింత పెద్దది చేశాడు.

ఇంతలో వితికా వచ్చి వరుణ్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఈ నామినేషన్స్ పై హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య మరోసారి చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ తనపై కౌంటర్ వేయడంతో తట్టుకోలేని శ్రీముఖి తనతో మాట్లాడొద్దని తెగేసి చెప్పింది. 'నీతో మాట్లాడడానికి నాకసలు ఇంట్రెస్ట్ లేదని' రాహుల్ వెటకరంగా మాట్లాడాడు.

అనంతరం బిగ్ బాస్.. హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కదలకుండా, మెదలకుండా, ఉన్నవాళ్లు ఉన్న చోట పడుకోవడం, మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాలి. ఈ టాస్క్ మధ్యలో ఇంటిలోకి కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ని పంపించారు. ముందుగా వితికా చెల్లెలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాగానే తన బావ వరుణ్ ని కౌగిలించుకొని.. ఆ తరువాత వెంటనే వితికా దగ్గరకి వెళ్లింది.

టాస్క్ లో ఉన్న వితికా రియాక్ట్ కాకూడదు కాబట్టి తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంది. బిగ్ బాస్ రిలీజ్ చెప్పడంతో తన చెల్లెల్ని పట్టుకొని ఏడ్చేసింది. బయట పరిస్థితులను  అడిగి తెలుసుకుంది. ఆమె వెళ్లిన కాసేపటికి అలీ రెజా భార్య మసుమ హౌస్ లోకి వచ్చింది. ఆమె వచ్చిన సమయానికి అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉండాల్సి రావడంతో నేరుగా తన భర్త దగ్గరకి వెళ్లి కూర్చుంది. అలీ ఎలా రియాక్ట్ అయ్యాడనేది రేపటి ఎపిసోడ్ లో చూపించనున్నారు.