బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పదమూడో వారం ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టంట్స్ ఉన్నారు. 85 రోజులకు పైగా హౌస్ లో ఉన్న కంటెస్టంట్స్ కోసం బిగ్ బాస్ ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. పోటీదారుల కుటుంబసభ్యులు ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. 

ఇప్పటివరకు వితికా చెల్లెలు, బాబా భాస్కర్ ఫ్యామిలీ, శివజ్యోతి భర్త, అలీ భార్య మసుమ హౌస్ లోకి వెళ్లారు. అయితే హౌస్ లో వారు ఎక్కువ సమయం ఉండే ఛాన్స్ లేదు. దీంతో వారున్నంత సమయం కంటెస్టంట్స్ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. నిన్నటి నుండి శ్రీముఖి తన తల్లి కోసం ఎదురుచూస్తోంది. గేటు దగ్గర నిలబడి 'అమ్మా.. ఎక్కడున్నావ్..?'  అంటూ చిన్నపిల్లలా పిలుస్తోంది.

ఇంకా శ్రీముఖి, వరుణ్, రాహుల్ ల కుటుంబసభ్యులు హౌస్ లోకి రావాల్సివుంది. నేటి ఎపిసోడ్ లో వారి ఎదురుచూపులకు తెరపడనుంది. తాజాగా ఈరోజు షోకి సంబంధించిన  ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కన్ఫెషన్ రూమ్ లో నుండి రాహుల్ తప్పి అతడిని పిలుస్తోంది. దీంతో పరిగెత్తుకొని కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి తన తల్లిని చూసుకొని ఎమోషనల్ అయ్యాడు రాహుల్. ఇక హౌస్ లో వరుణ్ బామ్మ సందడి చేయబోతుంది.

ఆమె ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి హౌస్ మేట్స్ నవ్వుతూనే కనిపించారు. తనదైన స్టైల్ లో పంచ్ లు, సెటైర్ లు వేస్తూ అందరినీ నవ్వించింది బామ్మ. ఫైనల్ గా ఆమె ఇంటిని వదిలే వెళ్లే సమయం వచ్చిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటే అంతలోనే.. 'బిగ్ బాస్ గారు మీరు మా ఇంటికి రావాలి..' అంటూ బిగ్ బాస్ ని ఇన్వైట్ చేయడంతో ఇంటి సభ్యులంతా తెగ నవ్వారు. ఈ ప్రోమోని చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఫన్ గా సాగబోతుందని తెలుస్తోంది.