బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో పునర్నవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ ని రాహుల్ తట్టుకోలేకపోతున్నాడు. సోమవారం ఎపిసోడ్ లో కూడా ఆమెని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

వరుణ్, వితికాలు రాహుల్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక వరుణ్ తో ముచ్చట్లు పెట్టిన వితికా.. 'బాటిల్ ఆఫ్ ది మెడాలియన్' గెలవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని  పొంగిపోయింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌కి ఎనిమిది ట్రాలీలు ఇచ్చారు. అయితే ఏడు పార్కింగ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. 

ముందు ఎవరైతే తమ ట్రాలీని పార్కింగ్ ప్లేస్ ఉంచుతారో వారు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారని.. పార్క్ చేయలేకపోయిన వాళ్లు నామినేట్ అవుతారని టాస్క్ ఇచ్చారు. మొత్తం నాలుగు రౌండ్ లలో తొలి రౌండ్ లో వరుణ్, రెండో రౌండ్ లో వితికా, మూడో రౌండ్ లో మహేశ్, నాలుగో రౌండ్ లో రాహుల్ లు నామినేషన్ లోకి వెళ్లారు. వితికా 'బాటిల్ ఆఫ్ ది మెడాలియన్' గెలవడంతో ఈ నామినేషన్ నుండి తనకున్న స్పెషల్ పవర్ తో తప్పించుకుంది.

ఫైనల్ గా ఈ వారం మహేశ్, వరుణ్, రాహుల్ లలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. నామినేషన్ ఈ ప్రాసెస్ లో బాబా భాస్కర్.. శ్రీముఖి, శివజ్యోతి, అలీలకు హెల్ప్ చేశాడని రాహుల్ అతడిపై మండిపడ్డాడు.