బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ షో పూర్తికానుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టంట్లు ఉన్నారు. శ్రీముఖి, అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా షెరు, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శివజ్యోతి లలో మరో రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టంట్లు బయటకి రానున్నారు.

ప్రస్తుతం వీళ్లంతా హౌస్ లో పోటాపోటీగా ఆడుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని ప్రతి ఒక్క కంటెస్టంట్ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే బయట వారి గురించి  క్యాంపైనింగ్ చేస్తున్నారు. శ్రీముఖిని గెలిపించమని ఏకంగా థియేటర్లలో యాడ్స్ కూడా వేస్తున్నారు. 'ఓట్ ఫర్ శ్రీముఖి' అంటూ ఫోన్ నెంబర్ తో సహా ఒక ప్రకటనను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.

టైటిల్ కోసం లోపల శ్రీముఖి, బయట ఆమె టీమ్ తెగ కష్టపడుతున్నారు. అయితే ఈ యాడ్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తనకు ఓట్ వేయమని శ్రీముఖి ప్రేక్షకులను కోరుతూ యాడ్స్ వేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు.

దీంతో వారు శ్రీముఖిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వలన శ్రీముఖికే డబ్బులు వేస్ట్ అని.. ఓట్లు వేయాలనుకునే వారికి కూడా ఇలాంటి యాడ్స్ చూస్తే వేయాలనిపించదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె అభిమానులు ఇటువంటి కామెంట్స్ ని తిప్పికొడుతున్నారు.