సోమవారం ఎపిసోడ్ మొత్తం నామినేషన్ ప్రక్రియ ఉండడంతో ఎవరు నామినేట్ కాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాబా భాస్కర్ స్మోకింగ్ రూమ్ కి వెళ్లి స్మోక్ చేస్తూ వరుణ్ తో నామినేషన్స్ గురించి మాట్లాడారు. ఈ వారం తను ఖచ్చితంగా వెళ్లిపోతానని, వాలంటీర్ గానైనా వెళ్లిపోతానని వరుణ్ తో చెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా 'టాపర్ ఆఫ్ ది హౌస్' అనే ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌ ని చిట్స్ తీయమని బిగ్ బాస్ చెప్పారు. ఆ చిట్ లో వచ్చిన నెంబర్ ప్రకారం ఏడు స్థానాల్లో నిలబడాలి. బిగ్ బాస్ సూచించిన స్థానం తమకు సరైనది కాదని అనిపిస్తే రీజన్ చెప్పి.. దానికి గల కారణాన్ని తెలియజేయాలి. వాళ్లు చెప్పిన వివరణతో ఇంటి సభ్యులు ఏకీభవిస్తే ర్యాంక్ లు మార్చుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో భాగంగా బాబా మొదటి స్థానంలో ఉండగా, రాహుల్ రెండో స్థానంలో, వరుణ్ సందేశ్ మూడో స్థానంలో, అలీ నాలుగో స్థానంలో, శివజ్యోతి ఐదో స్థానంలో, వితికా ఆరో స్థానంలో, శ్రీముఖి ఏడో స్థానంలో నిలిచారు. ఆరో నెంబర్ లో ఉన్న వితికా.. మొదటి స్థానం కోసం బాబా భాస్కర్ తో వాదించింది. కానీ అతడు ఒప్పుకోలేదు. ఫైనల్ గా మూడో స్థానంలో ఉన్న వరుణ్ తన భార్య కోసం త్యాగం చేశాడు.

అయితే దీనిపై శివజ్యోతి అభ్యంతరం చెప్పింది. భార్య అడిగిందని నీ ప్లేస్ ఎలా ఇచ్చేస్తావని.. ప్రశ్నించింది. మీరిద్దరూ గేమ్ ని గేమ్ లా చూడడం లేదంటూ మండిపడింది. ఇక టాస్క్ మొత్తంలో ఎవరికి వారే నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అని వాదించుకోవడంతో రంగంలోకి దిగిన బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న మొత్తం ఏడుగురిని ఈవారం నామినేషన్‌లో నెట్టి షాక్ ఇచ్చారు. దీంతో శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు నామినేట్ అయ్యారు.