బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. దీంతో బిగ్ బాస్ టాస్క్ లను కఠినతరం చేశారు. సోమవారం నాడు 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఆడించారు బిగ్ బాస్. మొత్తం ఆరుగులో ఒక్కరికి మాత్రం ఆ ఛాన్స్ దక్కుతుంది. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్ లో ఉండబోతున్నారు.

ఈ టాస్క్ కోసం రాత్రి, పగలూ తేడా లేకుండా హౌస్ మేట్స్ అందరూ టాస్క్ ల మీదే దృష్టి పెట్టారు. నిన్నటి టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ఈరోజు టాస్క్ లో అలీ రెజా, బాబా భాస్కర్ లు టాస్క్ కోసం పోరాడారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పాత్రలో ఇద్దరూ ఒక్కోరంగు పూలను పాతాల్సి ఉంటుంది.

 

ఫైనల్ గా ఎవరి పూలు ఎక్కవ ఉంటాయో వారే గెలిచినట్లు. ఈ ప్రాసెస్ లో టాస్క్ కాస్త హింసాత్మకంగా మారింది. అలీ, బాబాలు ఒకరినొకరు తోసుకుంటూ రెచ్చిపోయారు.  వారిద్దరూ తలపడడం చూసిన శ్రీముఖి, శివజ్యోతిలు చాలా టెన్షన్ పడ్డారు. టాస్క్ మరింత హింసగా మారుతుండడంతో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ అలీకి వార్నింగ్ ఇచ్చారు.

అయినప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో బిగ్ బాస్ టాస్క్ ని రద్దు చేశారు. అలీని ఎంతగా హెచ్చరించినా మాట వినకుండా బాబా భాస్కర్ పై బలప్రదర్శన చేయడంతో టికెట్ టు ఫీనాలే టాస్క్ నుండి అలీని తప్పించారు. 

 

అనంతరం హౌస్ మేట్స్ మధ్య దీని గురించి చర్చ జరిగింది. ఇక తదుపరి టాస్క్ లలో రాహుల్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో అతడిని 'టికెట్ టు ఫినాలే'టాస్క్ విజేతగా ప్రకటించారు. దీంతో మిగిలిన ఐదుగురు సభ్యులు వరుణ్, అలీ, శ్రీముఖి, బాబా, శ్రీముఖి, శివజ్యోతిలు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.