బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో పూర్తికాబోతుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో వెరైటీ టాస్క్ లు ఆడిస్తూ షోపై ఆసక్తి పెంచేలా చేస్తున్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ కాస్త ఫన్నీగా సాగింది. హౌస్‌లోని కంటెస్టంట్లకు ఈవారం ఫైనల్ మెడాలియన్ టాస్క్‌ ఇచ్చారు బిగ్ బాస్. అదే 'రిక్షాలో వీరవిహారం'. ఈ టాస్క్‌లో వితికా, బాబా భాస్కర్ పాల్గొనాలని 
బిగ్ బాస్ సూచించారు.

టాస్క్ ప్రకారం గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రిక్షాలో బాబా భాస్కర్, వితికా వీలైనంత ఎక్కువ సమయం కూర్చోవాలి. వీరిద్దరిలో ఎవరు ముందుగా రిక్షా దిగిపోతారో వారు ఓడిపోయినట్లు లెక్క. మిగిలిన హౌస్ మేట్స్ తమకి నచ్చిన పోటీదారుని సపోర్ట్ చేయొచ్చు. నచ్చకపోతే డిస్టర్బ్ చేయొచ్చు. అలానే మధ్యలో బిగ్ బాస్ పంపించే వస్తువులను పోటీదారులు ఇద్దరూ ఉపయోగిస్తూ ఉండాలి.

బజర్ మోగిన వెంటనే బాబా భాస్కర్ ముందుగా వెళ్లి రిక్షా ఎక్కేశారు. ఆ తరువాత వితికా వెళ్లి బాబా పక్కన కూర్చుంది. గేమ్ కాసేపు కూల్ గానే సాగింది. బిగ్ బాస్ పోటీదారులకు స్వెటర్లు, మిరపకాయలు, అపీ ఫిజ్ ఇలా ఒక్కొక్కటి పంపిస్తూనే ఉన్నారు. ఇక ఆ తరువాత బాబా భాస్కర్ టాయిలెట్ కి వెళ్లాలనుకున్నారు. కానీ రిక్షా దిగకూడదు. దీంతో శ్రీముఖి ఓ ప్లాన్ వేసింది.

దుప్పట్లు, గొడుగులు తీసుకొచ్చి వితికా రిక్షా మీద ఉండగానే బాబా భాస్కర్ కి అక్కడే టాయిలెట్ సమస్య తీరేలా సెటప్ చేసింది. అది ఇష్టం లేని వితికా.. బాబాని రిక్షా మీద నుండి తోసేసింది ఈ విషయంపై హౌస్ మేట్స్ మధ్య చర్చ జరిగింది. కొంతమంది వితికాను ప్రశ్నించగా.. తనముందు టాయిలెట్ పోస్తే చూస్తూ ఊరుకోనని సమాధానం ఇచ్చింది. ఫైనల్ గా బిగ్ బాస్ ఈ టాస్క్ లో వితికాను విజేతగా ప్రకటించారు.