దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు హోస్ట్ నాగార్జున. మంగళవారం నుండి హౌస్ లో సంబరాలు జరుగుతున్నాయి. నాగ్ రావడం కంటెస్టెంట్స్ రచ్చ చేస్తున్నారు. బంగార్రాజు గెటప్ లో హౌస్ లోకి వెళ్లిన నాగ్ హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ లు ఆడించారు.

బుధవారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించి ఒక్కొక్కరికీ ఒక్కో యాక్టివిటీ ఇచ్చి వారితో ఆడుకున్నారు నాగార్జున ఈ ప్రాసెస్ లో వరుణ్‌తో ఫ్రూట్స్ తినిపిస్తూ అతడిపై పంచ్ లు వేశారు. అలీ కళ్లకు గంతలు కట్టి మహేశ్ కి మేకప్ వేయించారు. ఇలా హౌస్ మేట్స్ అంతా తమ చేష్టలతో బాగా నవ్వించారు. శ్రీముఖి దగ్గరకి వచ్చేసరికి మహేశ్ చేయాల్సిన బెల్లీ డాన్స్ ని శ్రీముఖితో చేయించారు.

‘ఈ వెన్నెల రాత్రికి.. ఆ చంద్రుని వేడికి.. కావాలా కౌగిలి’  అనే పాటకి నాగార్జున ముందు బెల్లీ డాన్స్ చేసింది శ్రీముఖి. తన నాట్యంతో హౌస్ మేట్స్, నాగార్జునతో పాటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఇక హౌస్ లో అన్ని విషయాల్లో ఎవరు పెర్ఫెక్ట్ గా ఉన్నారో వాళ్లని ఎంపిక చేయాలని నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పారు. అలా ఎన్నికైన వారికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు.

ఈ ప్రాసెస్ లో శివజ్యోతికి, వరుణ్ కి రెండు స్టార్లు చొప్పున రావడంతో వారిద్దరికీ ఈ వారం మొత్తం స్పెషల్ గా డిన్నర్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఆ ఫుడ్ ని వీరిద్దరూ  మరెవరితో షేర్ చేసుకోకూడదు. ఇక రేపటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్న ప్రోమోని విడుదల చేశారు.