బిగ్ బాస్ 3లో తమ అభిమాన కంటెస్టెంట్స్ ని గెలిపించుకునేందుకు ప్రేక్షకులు ఓటింగ్ చేస్తున్నారు. శుక్రవారం రోజు ఓటింగ్ ముగియనుంది. దీనితో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

శ్రీముఖి గెలుపు కోసం ఆమె సోషల్ మీడియా టీం గట్టిగా కృషి చేస్తోంది. వరుణ్ సందేశ్ టైటిల్ గెలవాలని వితిక ప్రచారం చేస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా రాహుల్ సిప్లిగంజ్ తల్లి ఏ ఎమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఇంత దూరం వచ్చాడంటే అందుకు కారణం అతడి నిజాయతీ, ముక్కు సూటితనం అని చెప్పింది. ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాహుల్ కు ఓట్ చేసి అతడిని గెలిపించండి అని ఆమె ప్రేక్షకులని కోరింది. 

గతంలో రాహుల్ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి  తెలిసిందే. ఆ సమయంలో టాస్క్ లు బాగా ఆడమని, ఫైనల్ కు చేరాలని రాహుల్ తల్లి తడికి సూచించింది. తల్లి మాటలు రాహుల్ పై బాగా ప్రభావం చూపాయి. మంత్రం వేసినట్లుగా రాహుల్ టాస్క్ లలో చురుగ్గా పాల్గొన్నాడు. బ్యాటరీ టాస్క్ లో నెగ్గి ఫైనల్ కు చేరాడు.