బిగ్ బాస్ హౌస్ నుండి నటి పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చిన ఆమె తన స్నేహితులు రాహుల్, వరుణ్ లు నామినేషన్స్ లో ఉండడంతో వాళ్లకి ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో క్యాంపైనింగ్ మొదలుపెట్టింది.

రాహుల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని అంతకు మించి తమ మధ్య మరేం లేదని క్లారిటీ ఇచ్చింది. రాహుల్ టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లుగా బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని వెల్లడించింది. బిగ్ బాస్ షో విజేత ఎవరనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఎవరు మానసికంగా ధృడంగా ఉండి వంద రోజులు నెట్టుకొస్తారో వారే విజేత అని చెప్పింది.

ఇక హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ తన తల్లిపై బెంగ పెట్టుకున్నాడని, చాలా ఎక్కువ ఆలోచిస్తుంటాడని చెప్పింది. వితికా బంగారమని, చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందని.. కానీ టాస్క్ లో మాత్రం గట్టి పోటీనిస్తుందని చెప్పింది. వరుణ్ తనకు బ్రదర్ అని.. వాళ్లందరికీ మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. అలీ రెజా చాలా స్వీట్ అని, స్ట్రాంగ్ కంటెస్టంట్ అని, రవి త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడని, శ్రీముఖి చాలా ఎనర్జిటిక్ అని వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా.. పునర్నవి ఎలిమినేట్ అయినప్పుడు హిమజ టీవీ ముందు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన పునర్నవి.. 'అది ఊహించిన విషయమే' అని కొట్టిపారేసింది. హిమజ ఎందుకు అలా చేసిందో తననే అడుగుతానని.. దానితో వాదనలో ఎవరూ గెలవలేరని చెప్పుకొచ్చింది.