బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టంట్స్ ఉన్నారు. ఈ వారంలో ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోబోతున్నారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. 

ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన పద్నాలుగు మంది ఇంటి సభ్యులు తిరిగి హౌస్ లోకి వచ్చారు. శనివారం నాడు కూడా వారంతా హౌస్ లోనే ఉన్నారు. వారందరి కోసం హౌస్ లో పార్టీ ఎరేంజ్ చేశారు బిగ్ బాస్. ఈ పార్టీకి బాబా భాస్కర్, జాఫర్ లు హోస్ట్ లుగా వ్యవహరించారు.

ఈ పార్టీలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అవార్డులు అందజేసి వాళ్లను సంతోషపెట్టాడు.  అగ్ని గోళం, ఫుటేజ్‌ కింగ్‌, పక్కా మాస్‌, పటాక్.. ఇలాంటి ఎ‍న్నో అవార్డులను నేడు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు అందజేశారు. గతంలో తన పాటతో ఇంటి సభ్యులను భయపెట్టిన హిమజ మరోసారి పార్టీలో పాట పాడబోయింది.. దీంతో పునర్నవి 'మళ్లీనా' అంటూ పంచ్ వేసింది.  

అవార్డులు తీసుకున్న అనంతరం హౌస్ మేట్స్ కోసం బిగ్ బాస్ పక్కా మాస్ సాంగ్స్ ప్లే చేశారు. ఆ పాటలకు హౌస్ మేట్స్ అందరూ టాప్ లేచిపోయేలా డాన్స్ లు చేసిన రచ్చ చేశారు. ఆ తరువాత ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ వెళ్లిపోయే సమయం రావడంతో బిగ్ బాస్ వారిని బయటకి పంపించారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎవరు బిగ్ బాస్ షో విజేతగా నిలవనున్నారో తెలియనుంది!