బిగ్ బాస్ సీజన్ 3 శనివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో చూపించారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. అందరూ కలిసి ముగ్గురిని ఎంపిక చేసుకొని వారితో టాస్క్ చేయించాలి. దీనికి వరుణ్, బాబా భాస్కర్, అలీ ముందుకొచ్చారు. టాస్క్ లో భాగంగా పూల్ లో ఉన్న అప్పీ ఫిజ్ లను ఒక్కొక్కటి చొప్పున బయటకి తీసుకొచ్చి తాగుతూ ఉండాలి. 

ఒక్కసారి ఒక అప్పీ ఫిజ్ మాత్రమే తీసుకురావాలి. ఈ ప్రాసెస్ లో అలీ ఎక్కువ అప్పీ ఫిజ్ లు తాగడంతో అతడు టాస్క్ గెలిచాడు. అనంతరం నాగ్ హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. వారితో ఓ ఫన్నీ టాస్క్ చేయించారు. ఆ తరువాత 'మీలో ఎవరికి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత లేదనుకుంటున్నారు? ఈ యాభై లక్షల ఫ్రైజ్ మనీకి అర్హతలేని వ్యక్తి ఎవరో' చెప్పాలని హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున.

ఇందులో హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది బాబా భాస్కర్, మహేశ్ విట్టాల పేర్లు చెప్పారు. ఈ ప్రాసెస్ లో మహేష్, శ్రీముఖిల మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. మహేష్ ఎలాంటి కారణం లేకుండా తనను టార్గెట్ చేస్తున్నాడని శ్రీముఖి వాదించి అతడు హౌస్ నుండి వెళ్లిపోవడం తనకు కావాలని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక ఈ వారం ఎవరు  ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని నాగార్జున సస్పెన్స్ గా ఉంచుతూ ఆదివారం ఎపిసోడ్ లో తెలుసుకుందామని షో ముగించారు.