సెలెబ్రిటీలు అన్నాక విమర్శలు, ప్రశంసలు రెండూ ఎదురవుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగాక నెటిజన్ల నుంచి సెలెబ్రెటీలకు చికాకు పుట్టే కామెంట్స్ ఎదురవుతున్నాయి. కొందరు సెలెబ్రిటీలు ఎన్ని కామెంట్స్ ఎదురైనా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం కొందరు నెటిజన్ల విమర్శలకు తగు విధంగా సమాధానం ఇస్తుంటారు. 

తాజాగా తమిళ బిగ్ బాస్ ఫేమ్ నటి షెరీన్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల షెరీన్ ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునే తన పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఓ నెటిజన్ కెమెంట్ చేశాడు. షెరీన్ తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంది. బిగ్ బాస్ షో షెరీన్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఇక సదరు నెటిజన్ చేసిన కామెంట్ విషయానికి వస్తే..' నువ్వు బిగ్ బాస్ షోలో ఎంటర్ అయినప్పుడు మిడిల్ ఏజ్డ్ ఆంటీ లాగా ఉన్నావు. ఇప్పుడు మాత్రం రోజు రోజుకు యంగ్ గా మారుతున్నావు' అని వ్యాఖ్యానించాడు. 

షెరీన్ అతడికి రిప్లై ఇచ్చింది. 'అవును, కొంతంది రూపాన్ని చూసి భాదని కలిగించేలా కెమెంట్స్ చేస్తుంటారు. కానీ తెలుసుకోవలసింది ఏమిటంటే మనం భూమిపై జీవించే ఆత్మాభిమానం, మనల్ని మనం అభిమానించుకునే మనుషులం అని' అంటూ షెరీన్ రిప్లై ఇచ్చింది.