బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టంట్స్ ఉన్నారు. ఈ వారంలో ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోబోతున్నారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. 

ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన పద్నాలుగు మంది ఇంటి సభ్యులు తిరిగి హౌస్ లోకి వచ్చారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి షాక్ ఇచ్చింది. ఆమె ఎంటర్ అయిన తరువాత శ్రీముఖి.. హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ వద్దమ్మా.. నీకో నమస్కారం అంటూ పంచ్ వేసింది.

 

 

ఇక పునర్నవి ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. పునర్నవి రాగానే శ్రీముఖి ఆమె ఎత్తుకొని తిప్పేసి.. రాహుల్ దగ్గరకి తీసుకుకెళ్లింది. వితికా వచ్చిన వెంటనే తన భర్త వరుణ్ ని హత్తుకొని అలానే ఉండిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాబా భాస్కర్, జాఫర్ ల కామెడీ హైలైట్ గా నిలిచింది.

ఇద్దరూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఫన్ అందించారు. వీరందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోమని చెప్పిన బిగ్ బాస్ అందరి జర్నీని వీడియరూపంలో చూపించారు. అది చూసిన హౌస్ మేట్స్ ఆనందంతో కేకలు వేశారు. ఈ వీడియో చూసిన అనంతరం మాజీ కంటెస్టంట్ తమన్నా..  ఏడ్చుకుంటూ రవికి క్షమాపణలు చెప్పింది. రవి మీద తనకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదని.. తన గేమ్ స్ట్రాటజీలో భాగంగా రవితో అలా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది.