బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా 82 ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని శుక్రవారం నాటి ఎపిసోడ్ తో 83వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ పడుకుంటాడట. అతడిని డిస్టర్బ్ చేయకూడదట. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే వాళ్లకి శిక్ష విధిస్తాడట. అంటే టాస్క్ పూర్తయ్యే వరకూ ఎవరూ మాట్లాడకుండా, అరవకుండా, నవ్వకుండా టాస్క్ పూర్తి చేయాలి.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. శ్రీముఖి అరవకుండా అలీ గుర్రం ఎక్కించుకుని 20 రౌండ్లు కొట్టాలి. పాపం అలీ తనకు కష్టంగా ఉన్నా టాస్క్ పూర్తి చేశాడు. బాబా భాస్కర్ తన శరీరంపై ఉన్న జుట్టుని వాక్స్ చేయాలి. మహేష్ విట్టా తలపై ప్లేట్ పెట్టుకుని కింద పడకుండా.. గోడ కుర్చీ వేయాలి. వితికా, రాహుల్ బెలూన్స్‌కి షేవింగ్ క్రీమ్ రాసి నీట్‌గా షేవ్ చేయాలి. శివజ్యోతికి అలీ కితకితలు పెట్టాలి.

ఈ టాస్క్ పూర్తయిన తరువాత హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించి బొమ్మ గీయాలి. బిగ్ బాస్ బొమ్మ గీయడానికి హౌస్ మేట్స్ ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా తమకు నచ్చినట్లు గీసి దానికి అర్ధం కూడా చెప్పారు. ఇక నిన్నటి నుండి బిగ్ బాస్ హౌస్ లోకి కేకులు పంపించి హౌస్ మేట్స్ తో తినిపిస్తూనే ఉన్నారు బిగ్ బాస్.

ఒక కేక్ తిన్న వెంటనే మరో కేక్ అలా వారికి కేక్ ల మీద విరక్తి వచ్చేలా చేస్తున్నాడు. బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ భాగంగా ఇంటి సభ్యులకు ఒప్పో సెల్ ఇచ్చి రాహుల్ పాటతో వీడియో రూపొందించాలని చెప్పారు. బాబా భాస్కర్ డైరెక్షన్ అండ్ కెమెరా వర్క్ తో వీడియో బాగానే వచ్చింది.