నటుడు అలీ రెజా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. బిగ్ బాస్ 3 లో అలీ టైటిల్ విన్నర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలీ రెజా ప్రతిటాస్క్ లో చురుగ్గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అలీ రెజా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ లభించింది. 

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అలీ రెజా తన సొంత ఇంటి కల గురించి చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బాయటకు వచ్చాక అలీ రెజా ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. అలీ రెజా తాజాగా కొత్త ఇల్లు కొన్నాడు. 

ఈ శుభవార్తని అలీ రెజా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. మొత్తానికి నా కల నెరవేరింది.. త్వరలోనే గృహ ప్రవేశం, కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్నాం అని అలీ రెజా ఇన్స్టాగ్రామ్ లో తాను నివాసం ఉండబోయే అపార్ట్మెంట్ ఫోటో షేర్ చేశాడు. 

బిగ్ బాస్ లో పాల్గొన శివ జ్యోతి కూడా కొత్త ఇంటి కల నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. శివజ్యోతి కొత్త ఇంటి గృహ ప్రవేశానికి బిగ్ బాస్ 3 సెలెబ్రటీటీలంతా హాజరయ్యారు.