మంగళవారం ఎపిసోడ్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ని పంపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో వితికా చెల్లెలు రాగా.. నేటి ఎపిసోడ్ లో అలీ రెజా భార్య మసుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చేసరికి అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు. అలీ కూడా కళ్లు మూసుకొని ఉండగా.. మసుమ అతడి దగ్గరకి వెళ్లి ఒడిలో అలీ తల పెట్టుకొని ఏడ్చేసింది.

ఇంతలో శివజ్యోతి కూడా మసుమ వచ్చిందని తెలుసుకొని ఆమెని పట్టుకొని ఏడ్చేసింది. ఆ తరువాత మసుమ ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి పేరుపేరునా పలకరించింది. బిగ్ బాస్ స్లీపింగ్ మోడ్ నుండి రిలీజ్ చేయడంతో అలీ తన భార్యను దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. తన భార్యకి బిగ్ బాస్ హౌస్ మొత్తం చూపించాడు. మసుమ బయట పరిస్థితుల గురించి అలీకి వివరించింది.

శివజ్యోతితో మాత్రమే కాకుండా అందరితో మాట్లాడాలని, ఆమెతో బాండింగ్ బాగుందని కానీ గేమ్ ని సీరియస్ గా తీసుకోవాలని సలహాలు ఇచ్చింది. ఆమె హౌస్ ని వదిలి వెళ్లే సమయంలో అలీని కదల్లేని స్థితిలో ఉంచారు బిగ్ బాస్. మసుమ గేట్ దగ్గరకు వెళ్లిన తరువాత అలీని రిలీజ్ చేయడంతో పరుగున వెళ్లి తన భార్యని దగ్గరకు తీసుకున్నాడు. మసుమ వెళ్లిన కాసేపటికి హౌస్ లోకి శివజ్యోతి భర్త ఎంట్రీ ఇచ్చాడు. అతడిని చూసిన శివజ్యోతి బోరుమంటూ ఏడవడం మొదలుపెట్టింది. 

ఏడవద్దని తన భర్త ఎంతగా చెబుతున్నా.. శివజ్యోతి కంట నీళ్లు ఆగలేదు. ఆ తరువాత తన భర్తతో కాసేపు మాట్లాడింది. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుంది. కాసేపటికి అతడు వెళ్లిపోయే సమయం రావడంతో మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. తన భర్తను పంపించేసి అలీతో ముచ్చట్లు పెట్టింది శివజ్యోతి. ఇక కాస్త సమయం తరువాత బాబా భాస్కర్ ఇద్దరు పిల్లలు, భార్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బాబా భార్య రేవతి గేమ్ బాగా ఆడాలని, విన్నర్ గా గెలిచి రావాలని తన భర్తకి చెప్పింది. హౌస్ లో తన భర్త మాత్రమే కుక్ చేస్తున్నాడని.. మిగిలిన వారెవరికీ కుకింగ్ రాదా అంటూ హౌస్ మేట్స్ పై కౌంటర్ వేసింది. శ్రీముఖి ఎప్పుడు చూసిన గరిటె మాత్రమే తిప్పుతూ ఉంటుందని.. వితికా, శివజ్యోతి అసలు కిచెన్ లో కనిపించరని కామెంట్ చేసింది.