బిగ్ బాస్ సీజన్ 3 మరి కొద్దిరోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే ఫైనల్స్ లో రాహుల్ బెర్త్ కన్ఫర్మ్ చేశాడు. మిగిలిన ఐదుగురులో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో హౌస్ మేట్స్ లో ఒకరకమైన టెన్షన్ మొదలైంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఆ ఐదుగురులో ఒకరు సేవ్ అయిన విషయాన్ని బిగ్ బాస్ వెల్లడించాడు.

ముందుగా హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. KLM ఫ్యాషన్ తరఫున ఫ్యాషన్ షో నిర్వహించారు. బాయ్స్ లో ర్యాంప్ వాక్ ఎవరు బాగా చేశారో.. వారిని విజేతగా శ్రీముఖి, శివజ్యోతిలు నిర్ణయిస్తారు. ఇక శ్రీముఖి, శివజ్యోతిలలో ఎవరు ర్యాంప్ వాక్ బాగా చేశారో.. అలీ, వరుణ్, బాబా, రాహుల్ లు నిర్ణయిస్తారు. ఫైనల్ గా అబ్బాయిల్లో బాబా భాస్కర్, అమ్మాయిల్లో శివజ్యోతి  విజేతలుగా నిలిచారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో నిలిచిన హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించారు బిగ్ బాస్. అర్ధరాత్రి పూట సైరన్ మోగించి అందరినీ డిస్టర్బ్ చేశారు బిగ్ బాస్. నామినేషన్ లో ఉన్న ఐదుగురిని బ్యాగ్ లు సర్ధుకొని గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ మధ్య చర్చ మొదలైంది. శని, ఆదివారాలలో చేసే ఎలిమినేషన్ ఇప్పుడే చేస్తున్నారా అంటూ మాట్లాడుకున్నారు.

 

అర్ధరాత్రి లేపి బ్యాగులు సర్ధమని చెప్పిన బిగ్ బాస్ పై కాసేపు జోకులు వేసుకున్నారు. అనంతరం గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ చెప్పిన స్థలాల్లో నిలబడిన హౌస్ మేట్స్ ని హౌస్ లో వాళ్ల జర్నీ గురించి చెప్పమని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరూ తమ అనుభవాలను వివరించారు.

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై గ్రీన్ లైట్, రెడ్ లైట్ వేస్తూ ఆర్పుతూ ఫైనల్ గా బాబా భాస్కర్ పై గ్రీన్ లైట్ వేసి.. ఈ వారం ప్రేక్షకులు వేసిన ఓట్లతో బాబా సేవ్ అయినట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మిగిలిన వారిలో ఎవరు నామినేట్ కాబోతున్నారో వీకెండ్ లో నాగార్జున అనౌన్స్ చేస్తారని బిగ్ బాస్ చెప్పారు.