కరోనా ప్రభావం శుభాకార్యాల మీద కూడా గట్టిగానే పడింది. ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు లాక్‌ డౌన్‌ కావటంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరికొందరు లాక్ డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా అది కొద్ది మంది సమక్షంలో వివాహ తంతు కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ విన్నర్ కూడా తన పెళ్లి వేడుకను అత్యంత సాధాసీదా ముగించాడు.

హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ అశుతోష్ కౌషిక్‌ లాక్ డౌన్‌ సమయంలోనే అర్పితా తివారీన వివాహం చేసుకున్నాడు. తమ ఇంటి మేడ మీద ఒకరిద్దరు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సాదాసీదాగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట బందువులు సన్నిహితులంతా వేడుకను వీడియో స్ట్రీమింగ్ ద్వారా వీక్షించినట్టుగా తెలిపారు అశుతోష్‌ సన్నిహితులు.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు పెద్దగా హడావిడి లేకుండా సాధా సీదాగానే రెడీ అవ్వగా వివాహతంతు జరిపించిన పురోహితుడు మాస్క్, గ్లౌస్‌ ధరించి పెళ్లి చేయించాడు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశుతోష్‌ ఎట్టి పరిస్థితితుల్లోనూ వివాహాన్ని వాయిదా వేయనని చెప్పాడు. చాలా కాలం ముందట ముహూర్తం నిర్ణయించామన్న అశుతోష్, అందుకు తగ్గట్టుగానే  సాధాసీదాగా పెళ్లి తంతుత ముంగించేశాడు.