టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తరువాత రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. సాహో దర్శకుడు సుజిత్ రెడీగా ఉన్నప్పటికీ సినిమా పట్టాలెక్కే వరకు చెప్పలేము.

అయితే ఇటీవల రామ్ చరణ్ వద్దకు చాలా మంది సక్సెస్ ఫుల్ దర్శకులు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో చరణ్ ని కలిసినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి - వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల ఇలా వరుసగా ఫామ్ లో ఉన్న దర్శకులు రామ్ చరణ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమాలో నటిస్తున్న చరణ్ ఆ సినిమా అయిపోగానే మరొక సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడు.

 

ఈ టాలెంటెడ్ దర్శకులు చెప్పిన కథలపై పాజిటివ్ గా ఉన్న మెగా పవర్ స్టార్ ముందుగా ఎవరి కథను సెట్స్ పైకి తీసుకెళతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి చరణ్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.  400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న RRR సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ కి కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథను అందించారు.