దగ్గుబాటి వారి ఇంట్లో దొంగలు పడ్డారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి సురేష్ బాబుకి బాబాయ్.. హీరో రానా చిన తాతయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. దగ్గుబాటి సురేష్ బాబు, రామానాయుడు స్వస్థలమైన ప్రకాశం జిల్లా కారంచేడులో రామ్మోహనరావు ఇంట్లో దొంగలు పడ్డారు.

నగలు, నగదు పెద్ద ఎత్తున దోచుకెళ్లినట్లు సమాచారం. దొంగలు పడిన సమయంలో ఇంట్లో నగదు, బంగారం ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగలు పక్కాగా స్కెచ్ వేసి దోపిడీకి పాల్పడ్డారని సమాచారం. దోపిడీ అనంతరం బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆ హీరోతో లిప్ లాక్.. ఇబ్బంది పడ్డా : పూజా హెగ్డే

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేకంగా క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. దగ్గుబాటి రామానాయుడు చెన్నైకి వెళ్లి నిర్మాతగా సెటిల్ అయినా.. ఆయన తమ్ముడు రామ్మోహన్ నాయుడు మాత్రం సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు.

ఆయన కుటుంబం కారంచేడులోనే స్థిరపడింది. ఆ కుటుంబం నుండి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి రాలేదు. తాజాగా ఘటనతో రామ్మోహన్ నాయుడు కుటుంబ వివరాలు బయటకి వచ్చాయి.