చాలా రోజుల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు స్ట్రాంగ్ గా హడావుడి చేశాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు!' సినిమాతో పాటు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి ఫైట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఏ మాత్రం తడబడకుండా హీరోలిద్దరు ఎవరి స్థాయిలో వారు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు.

ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో పాటు అభిమానుల మధ్య గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. అల్లు ఆర్మీ vs మహేష్ ఫ్యాన్స్ ల సోషల్ మీడియా కామెంట్స్, ట్రోల్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. అయితే నెక్స్ట్ పవన్ కూడా మహేష్ తో పోటీపడే సమయం రానున్నట్లు టాక్ వస్తోంది. 2021కో ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందట.  ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ డిసెంబర్ మిడ్ లో రానుంది. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయనున్నాడ. అయితే ఆ సినిమా 2021 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.. ఇక అప్పుడే మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరక్కనున్న సినిమా కూడా నెక్స్ట్ సంక్రాంతికి విడుదల కానుంది. అంటే ఇరు వర్గాల అభిమానుల మధ్య కామెంట్స్ డోస్ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు, మరీ ఆ పరిస్థితిని ఈ ఇద్దరు హీరోలు ఎలా డీల్ చేస్తారో చూడాలి.