Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ మహేష్ ఛాన్సిచ్చిన చేసేలా లేడు?

వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇటీవల కాలంలో మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు. మినిమమ్ గ్యారెంటీ హిట్ తో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి చేసిన నరేష్ వరుస అపజయాలతో డల్లయ్యాడు. ఇకపోతే నెక్స్ట్ ఎలాగైనా మరో సక్సెస్ తో నిలదొక్కుకోవాలని బంగారు బుల్లోడు అనే సినిమా చేశాడు. 

big confusion on allari naresh career
Author
Hyderabad, First Published Dec 10, 2019, 11:04 AM IST

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇటీవల కాలంలో మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు. మినిమమ్ గ్యారెంటీ హిట్ తో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి చేసిన నరేష్ వరుస అపజయాలతో డల్లయ్యాడు. ఇకపోతే నెక్స్ట్ ఎలాగైనా మరో సక్సెస్ తో నిలదొక్కుకోవాలని బంగారు బుల్లోడు అనే సినిమా చేశాడు.

big confusion on allari naresh career

కానీ ఆ సినిమా అనేక కారణాలతో విడుదలకి నోచుకోవడం లేదు. మహేష్ బాబు మహర్షి సినిమాలో అతిధి పాత్రలో కనిపించిన నరేష్ ఆ సినిమా ఒప్పుకోవడానికి ముందు చేయాలా వద్దా అని చాలా ఆలోచించాడు., మొత్తానికి ఒప్పేసుకొని ఈ ఇయర్వెండితెరకు మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. అయితే మహర్షి అనంతరం నరేష్ కు అలాంటి ఆఫర్స్ కొన్ని వచ్చాయట. కానీ నరేష్ అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.

big confusion on allari naresh career

మహర్షిలో నరేష్ పాత్ర అంతగా క్లిక్కవ్వలేదనే చెప్పాలి. సినిమా కూడా అనుకున్నంతగా ప్రాఫిట్స్ ని అందించలేకపోయింది. గతంలో నరేష్ గమ్యం సినిమాలో చేసిన గాలి శీను రోల్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. నరేష్ కెరీర్ లోనే ఆ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. కానీ మహర్షిలో చేసిన రవి శంకర్ పాత్ర మాత్రం గమ్యం స్థాయిలో క్రేజ్ తేలేకపోయింది. ఇక ఇటీవల రెండు పెద్ద సినిమాల్లో కీ రోల్స్ వచ్చినప్పటికి నరేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

big confusion on allari naresh career

తన అసలైన హీరో ట్రాక్ సక్సెస్ రూట్ లోకి వచ్చే వరకు ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని నరేష్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట.  కానీ కామెడీ సినిమాలు ఈ రోజుల్లో డిఫరెంట్ గా ఉంటేనే జనాలకు నచ్చుతోంది. బంగారు బుల్లోడు పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఆ మధ్య ఒక సాంగ్ ని రిలీజ్ చేసిన నరేష్ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ అనుకున్నాడు. కానీ సమ్మర్ అయిపోయి మరో సమ్మర్ వస్తున్నా కూడా ఇంకా డేట్ ని ఫిక్స్ చేసుకోలేదు. మరి ఇలాంటి క్రిటికల్ టైమ్ లో నరేష్ ఎలాంటి కథల్ని సెట్ చేసుకుంటాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios