టాలీవుడ్ లో మెగాఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ టాప్ హీరోలుగా దూసుకుపోతుంటే వరుణ్ తేజ్ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. సాయి ధరం తేజ్ మధ్యలో తడబడినా.. మళ్లీ హిట్లు కొట్టి తన సత్తా చాటాడు.

ఇప్పుడు వీరి బాటలో మరో మెగాహీరో రాబోతున్నాడు. అతడే వైష్ణవ్ తేజ్. సాయి ధరం తేజ్ తమ్ముడే వైష్ణవ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన వైష్ణవ్ ఇప్పుడు 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ముద్దుల కొడుకుతో అమీజాక్సన్.. ఫోటోలు వైరల్!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ లోగో, హీరో హీరోయిన్ల ప్రీలుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇప్పటివరకు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ బాగానే ఉంది.

అయితే ఈ సినిమాపై మైత్రి మూవీ వాళ్లు పరిమితికి మించి బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్. విజయ్ సేతుపతికే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చినట్లు సమాచారం. అనుకున్న దానికంటే షూటింగ్ ఎక్కువ రోజులు జరగడం, లొకేషన్లు, సెట్టింగ్స్ ఖర్చు పెరగడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందని.. మొత్తం పూర్తయ్యేసరికి రూ.25 కోట్ల లెక్క తేలుతోందని సమాచారం.

అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు డబ్బు విషయంలో ఆలోచించే రకం కాదు. వాళ్ల సినిమాలన్నీ కూడా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినవే.. కానీ కొత్త హీరో, కొత్త దర్శకుడి మీద పాతిక కోట్లు పెట్టడమనేది చిన్న విషయం కాదు. సినిమా సక్సెస్ అయితే డబ్బు వెనక్కి వస్తుంది. లేదంటే కష్టం. సినిమాకి బిజినెస్ కూడా ఈ రేంజ్ లో అయ్యే ఛాన్స్ లేదు. మరి ఈ పెట్టుబడిని ఎలా రాబట్టుకుంటారో చూడాలి!