బాలీవుడ్ లో ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా హాట్ షాట్ హీరో. ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న చిత్రాలు విభిన్నంగా ఉంటూనే యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన తొలి చిత్రం విక్కీ డోనర్. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రాలు వరుసగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. గత ఏడాది ఆయుష్మాన్ బదాయి హో, అంధాదున్ లాంటి సూపర్ హిట్ గా నిలిచాయి. క్రమంగా ఆయుష్మాన్ మార్కెట్ పెరుగుతోంది. 

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఓ ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ జంటగా మూడు చిత్రాల్లో నటించారు. దమ్ లగ కె హైసా, శుబ్ మంగళ్ సావధాన్, రీసెంట్ గా బాల చిత్రాల్లో భూమి పెడ్నేకర్, ఆయుష్మాన్ ఖురానా కలసి నటించారు. 

వీరిద్దరూ కలసి నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించడంతో భూమి పెడ్నేకర్ సంబరపడిపోతోంది. ప్రేక్షకుల నుంచి భూమి పెడ్నేకర్, ఆయుష్మాన్ ఖురానా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని ప్రశంసలు దక్కుతున్నాయి. రీసెంట్ గా భూమి పెడ్నేకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయుష్మాన్ తో తనకు మంచి కెమిస్ట్రీ కుదిరిందనేది వాస్తవమే అని తెలిపింది. 

అతడి కలసి నటించడం తన అదృష్టం అని కూడా భూమి పెడ్నేకర్ పేర్కొంది. మేమిద్దరం మూడు చిత్రాల్లో కలసి నటించినా ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. అందుకు కారణం మా మధ్య ఉన్న కెమిస్ట్రీనే అని భూమి తెలిపింది. భవిష్యత్తులో కూడా తమ కాంబినేషన్ కొనసాగుతుందని భూమి తెలిపింది. 

బాల చిత్రంలో ఆయుష్మాన్ బట్టతల ఉన్న యువకుడిగా అద్భుత నటన కనబరిచాడు. ఈ చిత్రంలో యామి గౌతమ్ కూడా హీరోయిన్ గా నటించింది. అమర్ కౌశిక్ దర్శత్వంలో తెరకెక్కిన బాల చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.