ప్రభుత్వం కొలికి: ఎపిలో చిరంజీవి బోళాశంకర్ సినిమా టికెట్ రేట్లపై ఉత్కంఠ

భోళా శంకర్ సినిమా టిక్కెట్టు ధరలు పెంచేందుకు  అనుమతిని కోరుతూ  ప్రభుత్వానికి సినిమా యూనిట్ ధరఖాస్తు చేసుకుంది.  అయితే ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bhola Shankar cinema Unit  Requests ticket hike in Andhra pradesh lns

అమరావతి: భోళా శంకర్ సినిమా టిక్కెట్టు ధరలు పెంచేందుకు  అనుమతిని కోరుతూ  సినిమా యూనిట్ ఏపీ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. అయితే  ఈ ధరఖాస్తుకు సంబంధించిన  డాక్యుమెంట్లు లేవని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి డాక్యుమెంట్లు సమర్పించాలని  సినిమా యూనిట్ కు  ప్రభుత్వం సూచించింది. అయితే  ఈ విషయమై  ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు తక్కువగా ఉన్నాయని సినిమా యూనిట్ పేర్కొంది.  మల్టీప్లెక్స్  లలో సింగిల్ స్క్రీన్  సినిమా టిక్కెట్టు ధరను రూ. 25కు పెంచేందుకు అనుమతిని  ఇవ్వాలని  సినిమా యూనిట్ కోరిందని సమాచారం.రెండు  రోజుల క్రితమే  సినిమా యూనిట్  ప్రభుత్వానికి  ధరఖాస్తు చేసిందని సమాచారం.

రెండు  రోజుల క్రితం  వాల్తేరు వీరయ్య  200 రోజుల ఫంక్షన్ లో  సినిమా  నటుల రెమ్యూనరేషన్ పై  చిరంజీవి వ్యాఖ్యలు  ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.  ప్రజల కోసం మంచి పనులు చేస్తే ఆ ప్రభుత్వాలను ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు.  ఆదరణ, డిమాండ్ ఉన్న నటీనటులకు  రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటుందని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  ఏపీ మంత్రులు కూడ  అదే స్థాయిలో మండిపడ్డారు.  చిరంజీవిపై  మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తదితరులు వ్యాఖ్యలు  చేశారు.

also read:సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు: చిరంజీవి వ్యాఖ్యలకు కొడాలి కౌంటర్

 చిరంజీవి వ్యాఖ్యలపై  మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు  సినీ పరిశ్రమలో కొందరు పకోడి గాళ్లున్నారని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వాల గురించి ఎందుకు  మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పిచ్చుకపై బ్రహ్మస్తం ఎందుకని చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావిస్తూ  సినీ పరిశ్రమ పిచ్చుకా అని  ప్రశ్నించారు.ఈ విషయమై సమాధానం చెప్పాలని కోరారు.  మరో మంత్రి అంబటి రాంబాబు  కూడ  ఈ విషయమై  స్పందించారు.  చిరంజీవి ఏం మాట్లాడారో చూసిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios