నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. పిబ్రవరి 21 న విడుదైన ఈ చిత్రం నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ వీక్ 23.6 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న టాక్ కు కలెక్షన్స్ కుమ్మేస్తూ ఉండాలి. అయితే చాలా చోట్ల ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సూపర్ హిట్ రిపోర్ట్ ఉన్నా కలెక్షన్స్ డ్రాప్ అవటానికి కారణం ..డల్ గా ఉండే పిబ్రవరి సీజన్ లో రిలీజ్ చేయటమే అంటున్నారు.

వీకెండ్ లలో ఫ్యామిలీలతో థియోటర్స్ కళకళ్లాడుతున్నా...సోమవారం వచ్చేసరికి పడిపోతున్నాయి. పిల్లలకు పరీక్షల సీజన్ అయ్యిన ఈ టైమ్ లో రిలీజ్ చేయకుండా ఏ హాలీడేస్ సీజన్ లో విడుదల చేసి ఉంటే వేరే విధంగా ఉండేదని ట్రేడ్ లో లెక్కేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్లు చేసారు. ఇప్పటికే 24 కోట్లు పైగా వచ్చేసింది. కాబట్టి నష్టపోయేదేమి ఉండు. అయితే లాభాలే ఏ స్దాయిలో ఉంటాయనేది తేలాల్సిన విషయం.
   
ఇక ‘అఆ’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత  నితిన్‌ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్‌ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్‌ లాక్‌ చెయ్యటమే ప్లస్ అయ్యింది. దానికి తోడు ఫామ్ లో ఉన్న రష్మిక మందన హీరోయిన్‌గా నటించటంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. రిలీజ్ కు ముందు వచ్చిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో  రచ్చ చేశాయి. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం  నితిన్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించింది.