గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. ఛల్ మోహన్ రంగ, శ్రీనివాసకళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. నితిన్ కెరీర్ మొత్తం అప్పుడప్పుడూ ఒక హిట్.. వరుసగా పరాజయాలు అన్న చందంగా సాగుతోంది. దీనికి బ్రేక్ వేసి వరుసగా విజయాలు సాధించాలని నితిన్ అనుకుంటున్నాడు. 

అందుకే భీష్మ చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం నితిన్ విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు. తాజాగా నితిన్ భీష్మ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందించాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా అక్టోబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు నితిన్ ప్రకటించాడు. 

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ లో బాక్సాఫీస్ వద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉంది. దీనితో భీష్మ విడుదల వాయిదా పడ్డట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయలేదు. 

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ పై కూడా ప్రకటన చేస్తారేమో చూడాలి.