ఒక సినిమా రిలీజయ్యి కలెక్షన్స్ వస్తే తప్ప దర్శకులకు మరో అవకాశం దక్కడం లేదు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం విడుదలకు ముందే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఆ విధంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న దర్శకుడు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఈ దర్శకుడు భీష్మ సినిమాతో బిజీగా ఉన్నాడు.

నితిన్ - రష్మిక మందన్న ఆ సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఛలో సినిమాతో దర్శకుడికి మంచి సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములకు అప్పట్లో వెంటనే సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి మంచి అఫర్ వచ్చింది, నితిన్ డేట్స్ కఖాళీగా ఉండడంతో ఈ దర్శకుడిని సెలెక్ట్ చేశారు. భీష్మ స్క్రిప్ట్ వినగానే సింగిల్ సిట్టింగ్ లో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

read also: తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

ఇక ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ లో ఉంది. 2021 ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక గ్లిమ్ప్స్ వీడియో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. వెంకీ కుడుముల రెండవ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునేలా ఉందని టాక్ కూడా వస్తోంది. దీంతో దర్శకుడికి బడా ప్రొడక్షన్స్  నుంచి మంచి ఆఫర్స్ ఆవస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలనీ డేట్స్ కూడా తీసుకుంది.  మంచి కథ దొరికితే మీడియం బడ్జెట్ లో సినిమా చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు వెంకీ కుడుములతో మైత్రి మూవీ మేకర్స్ డీల్ సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. భీష్మ షూటింగ్ అయిపోతే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇక భీష్మకు సంబందించిన ఫస్ట్ సాంగ్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.