Asianet News TeluguAsianet News Telugu

'భీష్మ' ఫస్ట్ డే కలెక్షన్స్.. బీభత్సం (ఏరియా వైజ్)

ఇలాంటి అన్ సీజన్ లో వచ్చింది  హిట్. అదిరిపోయే ఎంటర్ టైనర్ గా రూపొందిన భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయ్యి..మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

Bheeshma collects Rs 6 Crore in day 1
Author
Hyderabad, First Published Feb 22, 2020, 11:24 AM IST

ఈ సంవత్సరం సంక్రాంతికు రిలీజైన రెండు సినిమాలు ఘన విజయం సాథించి,భాక్సాఫీస్ కు ఊపిరిపోసాయి. ఆ  తర్వాత మరో హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ కి సరైన సినిమా ఏదీ పడలేదు. సినిమాలు రావటం,వెళ్లటం అన్నట్లుగా మారింది. డిస్కోరాజా, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి ఎంతో ఎక్సపెక్టేషన్స్ ఉన్న పెద్ద సినిమాలు సైతం బోల్తా కొట్టడంతో థియోటర్స్ డీలా పడ్డాయి. 

ఇలాంటి అన్ సీజన్ లో వచ్చింది  హిట్. అదిరిపోయే ఎంటర్ టైనర్ గా రూపొందిన భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయ్యి..మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ఓపెనింగ్స్ కొంచం స్లో గా మొదలు అయినా మ్యాట్నీ షోల నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ ని చూపెడుతూ దూసుకు పోతోంది.

నితిన్ ‘భీష్మ’ రివ్యూ

అందుతున్న సమాచారం మేరకు...భీష్మ సినిమా మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణాలో 6.3 కోట్ల షేర్ సాధించింది. గతంలో ‘అ.. ఆ’ సినిమా 5.6 కోట్ల షేర్ తో నితిన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ డే రికార్డ్ ని ‘భీష్మ’ బ్రేక్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది
 
‘భీష్మ’  తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం                  –      2.24 కోట్లు
సీడెడ్                   –      80.5 లక్షలు
గుంటూరు            –       77.1 లక్షలు
ఉత్తరాంధ్ర           –       62 లక్షలు
తూర్పు గోదావరి   –        66.5 లక్షలు
పశ్చిమ గోదావరి   –       56 లక్షలు
కృష్ణా                    –       40.5 లక్షలు
నెల్లూరు               –        27 లక్షలు
భీష్మ ఫస్ట్ డే మొత్తం షేర్  – 6.33 కోట్లు

 ఏదైమైనా ఈ సినిమా నితిన్ కు బెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇక ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ లో సగానికి పైగా రికవరీ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి మంచి ఎంటర్టైనర్ దొరికింది, అలాగే మార్కెట్ లేమీ సినిమాలేవీ లేకపోయావడం వలన ఫుల్ థియేటర్స్ దొరికాయి.

పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.  మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేసారు.  

Follow Us:
Download App:
  • android
  • ios