యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల కోసం ప్రస్తుతం దేశం మొత్తం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దశ దిశలా వ్యాపించింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రం హిట్ అయి ఉంటె రికార్డుల మోత మోగించేదే. కానీ ఛాన్స్ మిస్సయింది. 

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రంలో  ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ చిత్రం లో అలనాటి అందాల తార భాగ్య శ్రీ కీలక పాత్రలో నటించనుంది. 

కాజల్ సెక్సీ ఫోజులు.. నడుము అందాలతో మైమరపిస్తోంది..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా భాగ్యశ్రీ నే అంగీకరించింది. సల్మాన్ ఖాన్ సరసన భాగ్యశ్రీ మైనే ప్యార్ కీయా(ప్రేమ పావురాలు) చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంతో భాగ్యశ్రీ అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. 

మరోసారి వెండితెరపై మెరవబోతున్నందుకు సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. ఇక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని పలు కథలు వింటున్న తరుణంలో ప్రభాస్ చిత్ర కథ తన వద్దకు వచ్చిందని భాగ్యశ్రీ తెలిపింది. ఈ చిత్రంలో తన పాత్ర అంత సులువైనది కాదని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. 

ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960 కాలం బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు టాక్. ప్రభాస్ సినిమాలో భాగ్యశ్రీ నటిస్తోందట బాలీవుడ్ లో మొత్తం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.