బాలీవుడ్ లో యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే ట్యాగ్ తో తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్న కథానాయకుడు టైగర్ ష్రాఫ్. భాగీ సీక్వెల్స్ తో సరికొత్తగా కిక్కుస్తున ఈ కండలవీరుడు మూడవ సీక్వెల్ తో కూడా అంతకుమించిన  యాక్షన్ డోస్ పెంచేశాడ. భాగీ 3 కలెక్షన్స్ పై కరోనా ఎఫెక్ట్ పడుతుందని అంతా భావించారు.

కానీ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే టైగర్ ష్రాఫ్ కరోనా కి కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ట్రైలర్ తోనే   చిత్ర యూనిట్ ఆడియెన్స్ లో అంచనాలను మరీంత పెంచేసింది. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగీ 3 మొత్తానికి మొదటిరోజు 17కోట్ల వసూళ్లతో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. మొదట కరోనా కారణంగా సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ 'నో టైమ్ టూ డై' సైతం కరోనా వైరస్ వల్ల వాయిదా పడింది.

ఏడు నెలల తరువాత సినిమాను రిలీజ్ చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ టైగర్ ష్రాఫ్ భాగీ 3 మాత్రం అవేమి పట్టించుకోకుండా అనుకున్న డేట్ కి వచ్చింది. సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో వీకెండ్ కలెక్షన్స్ డోస్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి సినిమాపై కరోనా ఎఫెక్ట్ ఎంత మాత్రం చూపలేదని అర్ధం చేసుకోవచ్చు.