ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. ఈ ఒప్పందం మేరకే సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది.


తలపతి విజయ్ నటించిన “బీస్ట్” ఏప్రిల్ 13న విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ వచ్చజింది. “బీస్ట్” వర్సెస్ “కేజీఎఫ్-2” అన్నట్టుగా ఒకే ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు విడుదల అవటంతో మరీ దెబ్బ పడింది. అయితే ‘కేజీఎఫ్-2’ చిత్రానికి అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఆ ఎఫెక్ట్ “బీస్ట్”పై గట్టిగానే పడింది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. “బీస్ట్” ఓటిటి రిలీజ్ అఫీషయల్ ప్రకటన వచ్చింది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. ఈ ఒప్పందం మేరకే సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది.ఈ చిత్రం మే 11న నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రీమియర్ అవుతుంది. ఈ మేరకు సన్ నెక్ట్స్ వారు ట్వీట్ చేసారు.

 “కో కో కోకిల, డాక్టర్” వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన దర్శకత్వం వహించిన “బీస్ట్” సినిమా విడుదలైంది. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న “మనీ హేస్ట్” మాదిరి కంటెంట్ తో తెరకెక్కింది “బీస్ట్” అనే ప్రచారం నడిచింది. కామెడీ విషయంలో నెల్సన్ కు మంచి గ్రిప్ ఉందన్న విషయాన్ని, తొలి రెండు సినిమాలు “కో కో కోకిల, డాక్టర్” స్పష్టం చేసాయి. అదొక ప్లస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడుని ఎంటర్టైన్ చేయటంలో తడబడింది.

 ఇక బీస్ట్ సినిమాని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో బీస్ట్ సినిమాతో విజయ్ ని మరింత ప్రమోట్ చేస్తే తన సినిమాకి పనికొస్తుందని దిల్ రాజు గతంలో విజయ్ సినిమాల కంటే ఎక్కువ రేటు పెట్టి తెలుగు రైట్స్ కొన్నారు.