పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిలో నిర్మాత బండ్ల గణేష్ స్టైలే వేరనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పవన్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకునే బండ్లగణేష్ ఈ సారి ఓ చిత్రమైన ట్వీట్ చేశాడు.
పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిలో నిర్మాత బండ్ల గణేష్ స్టైలే వేరనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పవన్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకునే బండ్లగణేష్ ఈ సారి ఓ చిత్రమైన ట్వీట్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని. ఆయన నా గాడ్ అంటూ ఎక్కడ సమయం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేసి హాట్ టాపిక్ అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా నిలదొక్కుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత వరుస సక్సెస్ లు అందుకున్నాడు.
నిర్మాతగా కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. అలాగే పవన్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలలో మాట్లాడే స్పీచ్ లు, ఉత్తేజపరిచే మాటలు పవన్ అభిమానులకు జోష్ కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ సారి బండ్లన్నకు ఆ అవకాసం రాలేదు. పవన్ ని ప్రేమగా దేవర అని పిలుచుకునే బండ్ల గణేష్ ని భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలవలేదని వినికిడి. ఈ నేపధ్యంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ ఆ మధ్యన విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు. ఇప్పుడు డేగల బాబ్జీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో కనపించనున్నారు. సినిమాలతో పాటు ప్రస్తుత, రాజకీయం సామాజిక అంశాలపై అప్పడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ కాంట్రవర్సీ అవుతూ ఉంటాడు బండ్ల గణేశ్. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే.
