ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్’ సినిమా ఆర్ధికవ్యవహారాల్లో బండ్ల గణేష్, పీవీపీల మధ్య ఆర్ధికవ్యవహారాల్లో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఇక బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా వరుస పోస్ట్ లు పెడుతూ పీవీపీని టార్గెట్ చేస్తున్నారు. పీవీపీని స్కాం రాజా అని పిలుస్తూ పరోక్షంగా అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.

''స్కాం రాజా నా అప్పులు తప్పులు అన్ని కలిసి నువ్ ఒక్క రోజు బొంబాయి లో జల్సా అంత లేదు నా బ్రతుకు, నీ స్కాంలు దేశ విదేశాలు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందాయి, ఎన్నో స్కాములకు నువ్వు మూలం, నీ దొంగ సంతకాల స్కాంలతో ఎందరో జీవితాలు బ్రష్టు పట్టించావు, ఎంతోమందిని మోసం చేసావ్.. ఇప్పటికైనా మానుకొని నీతిగా నిజాయితీగా బ్రతుకు, కస్టపడి బ్రతుకు'' అని సలహా ఇచ్చారు.

''నీలాగా నాకు రోజుకొక పార్టీ గంటకోక మనిషి, ఒకొక్కడిని ఒకోరోజు తిడతావ్, ఒకోరోజు పొగుడుతావ్, ఒకరోజు భుజాన వేసుకువెళ్తావ్, వాళ్లు నన్ను మోసం చేసారు అంటావ్, మళ్ళీ రెండో రోజు వాళ్ల దగ్గరకే టికెట్ తెచ్చుకుంటావ్, అయినా జనం అందరూ చీదరించిన చిత్కరించిన అక్కడే ఏలాడుతూ ఉంటావ్.. కానీ నేను అలా చేయను'' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నీ స్కాంలతో దయచేసి పార్టీని, ప్రజలను బ్రష్టుపట్టించి ఆయనకి చెడ్డ పేరు తీసుకురాకు అంటూ ఫైర్ అయ్యారు.