కొన్నిరోజులుగా బండ్ల గణేష్, పీవీపీ మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ తనను మోసం చేశాడని, తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగివ్వకుండా మనుషులను పెట్టి బెదిరిస్తున్నాడని పీవీపీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ విషయంపై మాట్లాడిన బండ్ల గణేష్.. పీవీపీ కారణంగా తన ప్రాణహాని 
ఉందని అన్నారు. నిన్నటి నుండి ట్విట్టర్ లో పీవీపీని ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ పెడుతున్నారు.

కాల్ షీట్‌కు, మామూలు షీట్‌కు, మేకప్‌కి ప్యాకప్‌కి తేడా తెలియని కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారని.. సినిమా తీసిన ప్రతీ హీరోతో గొడవే అని.. మాట్లాడితే  కోర్టులు, కేసులు అంటూ ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ గారినే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీదంటూ పీవీపీని ఉద్దేశిస్తూ అన్నారు. పీవీపీని స్కామ్ రాజా, ఇస్కాన్ రాజా అని సంభోదిస్తూ వరుస ట్వీట్లు చేశాడు బండ్ల గణేష్. 

''ఎవరన్నా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారు, లేదా కోర్టుల్లో కేసు వేసి న్యాయం కోసం పోరాడతారు. ఓ భారతీయుడిగా చేయాల్సిన పని ఇది. కానీ 14 ఏళ్ల పాటు పగలు రాత్రి తన దగ్గర పని చేసిన భానుప్రకాష్ అనే ఉద్యోగిని ఈ స్కామ్ రాజా, కిడ్నాప్ చేసిబంధించి, దారుణంగా హింసించి, అతని పేరిట వున్న ఆస్తులు తన పేరిట రాయించుకుని, వదిలేసారు. భాను భార్య కూకట్ పల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే, బలవంతంగా విత్ డ్రా చేయించారు. తన ఉద్యోగినే అలా చేస్తే విజయవాడ ప్రజలను ఏం చేస్తారో?'' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

అద్భుతమైన పరిపాలన అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి విన్నపం ఇస్కాన్ రాజా నుంచి ఇండస్ట్రీని ప్రజలను అందర్నీ కాపాడండి అంటూ సూచించారు.  తెలంగాణలో చట్టాన్ని,న్యాయాన్ని డబ్బులిచ్చి కొనలేమని స్కామ్ రాజా గుర్తించాలి..ధర్మమే జయిస్తుంది.ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ వుంటుందని.. ఈ స్కామ్ రాజాకు  దొంగసంతకాలు పెట్టే టాలెంట్ వుందని.. ఆ కళకు ఎందరో స్నేహితులు బలయ్యారని.. ఆఖరికి స్వంత అన్నతో సహా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

''టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇస్కాన్ రాజా నేను కష్టాల్లో ఉన్నాను నాకు ఇమేజ్ కొంచెం పెంచు నా గురించి కొంచెం బాగా మాట్లాడు ప్లీజ్ అని నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను ఈ విధంగా మాట్లాడాను'' అంటూ చెప్పుకొచ్చాడు.