కరోనా వచ్చి కోలుకున్న తరువాత బండ్ల గణేష్ లో చాలా మార్పు కనిపిస్తుంది. రతన్ టాటా ద్వేషాన్ని ఆపండి అంటూ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది మొదలు బండ్ల గణేష్ ప్రేమను పంచుతూనే ఉన్నాడు. మొన్ననే ఒక చిన్నారి వైద్యానికి సహాయం చేయమని గవర్నర్ ని కోరినప్పుడు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. 

తాజగా నేడు ఒక వ్యక్తి తనకున్న ఆర్ధిక  ఇబ్బందుల వల్ల కిడ్నీని అమ్ముతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తాను గతంలో బజాజ్ ఫైనాన్స్ లో ఉద్యోగం చేసేవాడినని, కానీ ప్రస్తుతం ఉద్యోగం లేదని తెలిపాడు. తనకు రెండు లక్షలు అవసరం ఉన్నందున తాను కిడ్నీని అమ్మకానికి పెట్టినట్టు తెలిపాడు. 

దీనిపై స్పందించిన బండ్ల గణేష్.... డీటెయిల్స్ ఇవ్వవలిసిందిగా కోరాడు. జీవితాన్ని పాడుచేసుకోవద్దని హితవు పలుకుతూ, తాను ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాడు. బండ్ల గణేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.