టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్ సడెన్ గా బడా ప్రొడ్యూసర్ గా మారాడు. అతడి మిస్టీరియస్ స్టోరీగురించి ఇండస్ట్రీలో వారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది జరిగి పదేళ్లు అవుతున్నప్పటికీ ఆ మాటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బండ్ల మాత్రం తన ఆస్తుల గురించి డబ్బు వ్యవహారాల గురించి మట్లాడడు.

తన కోళ్లఫారం గురించి మాత్రం చెప్పుకుంటూ ఉంటాడు. మొన్నామధ్య రాజకీయాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఛాలెంజ్ లు కూడా చేశారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో బండ్ల గణేష్ రాజకీయాల్లో అడ్రెస్ లేకుండా పోయారు. ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో బండ్ల కమెడియన్ గా కనిపించనున్నాడు.

ఇది ఇలా ఉండగా.. బండ్ల గణేష్ ని అరెస్ట్ చేయడానికి మహారాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారనే టాక్ నడుస్తుంది. అక్కడ కూడా ఏవో వ్యవహారాలు బండ్ల గణేష్ కి అరెస్ట్ వారెంట్ వచ్చే వరకూ చేశాయని టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడిపై కేసులు తక్కువేమీ లేవు. ఇప్పటివరకు బండ్ల గణేష్ పై ఎనభైకి పైగా చెక్ బౌన్స్ కంప్లైంట్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

కడప జిల్లా, ప్రొద్దుటూరు వాళ్లకే భారీ ఎత్తున బౌన్స్ అయ్యే చెక్కులను ఇచ్చాడట బండ్ల గణేష్. అక్కడ ఉండే వ్యాపారస్తుల దగ్గర నుండి సినిమాలు తీస్తున్నానని కొంత డబ్బుని అప్పుగా తీసుకొని ఇప్పుడు ఆ డబ్బు చెల్లించకుండా తిరుగుతున్నాడని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇలా ఎనభైకి పైగా చెక్ బౌన్స్ కేసులు కలిగిన వారు ఇండస్ట్రీలో బండ్ల తప్ప మరెవరూ లేరనిమాట్లాడుకుంటున్నారు. మరి ఈ కేసులన్నీ ఎప్పుడు క్లియర్ చేసుకుంటాడో చూడాలి!