Asianet News TeluguAsianet News Telugu

#BandlaGanesh: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్, వైరల్


బండ్ల గణేష్ నటుడిగా నిర్మాతగా కంటే వివాదాస్పద మాటలతో పాటు ట్వీట్స్‌తో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీర విధేయుడిగా ఉన్న ఈయన తాజాగా చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

Bandla Ganesh caught everyone attention with his Diwali wishes
Author
First Published Oct 25, 2022, 7:44 AM IST

బండ్ల గణేష్ ... ఏది చేసినా క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మాట్లాడిన, సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా, ఓ ఫోటో పోస్ట్ చేసినా..మామూలుగా ఉండదు. 
బండ్లన్న ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో మాట్లాడిన మాటలు, ఆడియో లీకుల మీద నోరు విప్పడం, త్రివిక్రమ్‌ను తాను తిట్టానని ఒప్పుకోవడం అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఈ సారి చేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది. ఈయన ప్రతి దీపావళికి భారీగా క్రాకర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే దీపావళికి అందరూ తమ శక్తి మేరకు టపాసులు కొనుక్కుంటారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ దీపావళికి బండ్ల గణేష్ ఏకంగా నాలుగు లక్షల పైనే ఖర్చుపెట్టి దీపావళికి టపాసులు కొనేశారు. 

రెగ్యులర్ గా ...బండ్ల గణేష్ ప్రతీ దీపావళికి టపాసులు కొంటాడు. వాటిని ఇంటి ముందున్న వరండాలో పేర్చుతాడు. వాటిని ముందు నిల్చుని అలా ఫోటో దిగుతాడు. ఆ ఫొటో చూసిన వారు ఊరంతా సరిపోయే టపాసులను కొంటాడా? అని అందరికీ అనుమానం వస్తూంటుంది. గత రెండేళ్ల నుంచి బండ్ల గణేష్ ఇలానే చేస్తూ ఉన్నాడు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన ,వీడియో కూడా షేర్ చేశాడు.

 ఓ ట్వీట్ తో .. ఈ ఏడాది మాత్రం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో బయటకు వచ్చింది. మీడియాతో మాట్లాడుతూ.. అసలు సంగతి చెప్పేశాడు బండ్లన్న. నాలుగు లక్షల విలువైన టపాసులను కొనేశాడట బండ్లన్న. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెట్టేశారు. ఈ ట్వీట్ చూసిన వాళ్లు...వామ్మో బండ్లన్న మామూలోడు కాదు.. బండ్లన్నతో అట్లుంటది అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ఇందులో చాలా మటుకు గిఫ్టులుగా అందరికీ పంపిస్తాడని సమాచారం.

ఇక బండ్ల గణేష్ .. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు అంటూ బిజీగా ఉంటారు. ఇప్పుడు తీస్తే కూడా పెద్ద హీరోతో పెద్ద సినిమానే తీస్తాను అని చెప్తూంటారు. అలా పెద్ద నిర్మాతగా బండ్ల గణేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. రాజకీయాలకు మళ్లీ దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తోంది అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios