బ్లాక్ బస్టర్ నిర్మాత పేరుగాంచిన బండ్ల గణేష్ కు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆపడం కష్టం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు ఈ బండ్ల బాబు. కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ మైంటైన్ చేస్తున్న బండ్ల గణేష్ ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. 

ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం బండ్ల గణేష్ పై కూడా పండింది. కరోనా కారణంగా పౌల్ట్రీ రంగం దెబ్బ తిన్నసంగతి తెలిసిందే. దీనితో బండ్ల గణేష్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇటీవల బండ్ల గణేష్ ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జపం చేస్తున్నాడు. వరుస ట్వీట్స్ తో బండ్ల గణేష్ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. 

నాగార్జున వద్దు ఎన్టీఆరే ముద్దు: బిగ్ సీజన్ 1 రీ టెలికాస్ట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్

కరోనా ప్రభావంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న తరుణంలో కేసీఆర్ ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ, కరోనా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో బండ్ల గణేష్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. 

'మా కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాలుగు రోజులు కాదు సార్.. 40 రోజులైనా మీ పైన భరోసాతో ఇళ్లకే పరిమితమై విజయం సాధిస్తాం. మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆ భగవంతుని దయతో జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ బండ్ల గణేష్.  కష్టాలైనా భరిస్తాం.. ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాం మీరున్నారనే నమ్మకం.. రక్షిస్తారనే ధైర్యం జై కేసీఆర్' అంటూ బండ్ల గణేష్ ఒక రేంజ్ లో కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.