మల్టీ స్టారర్ చిత్రం ‘ఆచార్య’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. తాజాగా రిలీజ్ అయిన ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమోతో అంచనాలు మరింతగా  పెరిగిపోతున్నాయి. తండ్రీకొడుకులు చిరుత పులుల్లా చిందేయటం అభిమానుల్లో జోష్ ను పెంచుతోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ (Acharya). ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ కాస్తా టైంలో మేకర్స్ అభిమానుల్లో జోష్ పెంచేందుకు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల ‘భలే భలే బంజారా’ (Bale Bale Banjara) సాంగ్ ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను వదిలారు. య్యూటూబ్ లో ప్రస్తుతం దూసుకెళ్తుందీ ప్రోమో.

ప్రొమోలోనే తండ్రీ కొడుకులు మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఫుల్ సాంగ్ వస్తే చిరుత పులులు చిందాడినట్టే ఉంటుందనేలా ప్రొమోను వదిలారు మేకర్స్. ఈ ప్రొమోలో భలే భలే బంజారా సాంగ్ కు సంబంధించిన ఓ చరణాన్ని వదిలారు. ‘హే సింబా రింబా.. చిరుతా పులులా చిందాటా.. సింబా రింబా సరదా పులులా సయ్యాట.. భలే భలే బంజారా, మజ్జ మందేరా.. రే కచ్చేరిలో రెచ్చిపోదామురా’ అంటూ సాగే లిరిక్స్ వినిసొంపుగా ఉన్నాయి. ప్రోమోలోనే ఇంతలా రెచ్చిపోయారంటే ఫుల్ సాంగ్ వస్తే పునకాలే అంటున్నారు నెటిజన్లు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. 

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకాలపై నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…