సింహా,లెజెండ్‌ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం(బీబీ3) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా  గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఉగాది పర్వదినం రోజున ఈ చిత్రానికి ‘అఖండ’అనే టైటిల్‌ ఖరారు చేసి టీజర్‌ని కూడా విడుదల చేసింది. గత సినిమాల మాదిరే సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ కూడా పవర్‌పుల్‌గా ఉండి జనాల్లోకి దూసుకుపోయింది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇక బోయపాటి సినిమాల్లో ఇంటర్వెల్ ఓ రేంజిలో ఉంటుంది. ఆ ఇంటర్వెల్ కు సంభందించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు టీజర్ లో చూపించిన సీనే ఇంట్రవెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. అక్కడే సెకండ్ బాలయ్య ఎంట్రీ ఇస్తారట. దాంతో థియోటర్స్ దద్దరిల్లుతాయని అంటున్నారు. అఘోరాగా బాలకృష్ణ ఎంట్రీ ప్రేక్షకులను సరికొత్త అనుభూతినిస్తుందని, టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఈ బ్రేక్ పాయింట్ సాలిడ్‌గా ఉంటుందని చెప్పకుంటున్నారు.ఈ ఎపిసోడ్‌ను సినిమాకే హైలెట్‌గా నిలిచేలా డిజైన్ చేశాడట బోయపాటి. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయమట. అఖండ చిత్రంలో శ్రీకాంత్‌, పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
 
ఇక ఈ సినిమాకు సంభందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియోటర్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యిపోయాయి.  తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా ఫినిష్ చేసినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా వారు తీసుకోగా, డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. రెండు డీల్స్ కలిసి 15 కోట్లుకు క్లోజ్ చేసారని సమాచారం. బాలయ్య  సినిమాల విషయానికి వస్తే ఇది మంచి డీల్. కెరీర్ లో బెస్ట్ డీల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే..ఇంకా పదిహేను రోజులు పెండింగ్ ఉంది.   
    
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్‌’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.