న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సికె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి. క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘రూల‌ర్‌’. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ  ట్రైలర్ ని ఇటీవ‌ల విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రంలో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప్రత్యేకంగా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గటం ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథ ఏమై ఉంటుందనే విషయమై సిని అభిమానుల్లో  చాలా చర్చ జరుగుతోంది.

నిర్మాత ఈ చిత్రం స్టోరీ లైన్ రివీల్ చేస్తూ ...‘రూలర్‌’ మంచి కథ. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ ఉండదు. ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన తెలుగువాళ్ల కథ. సెటిలర్స్‌ సమస్యల్ని నేపథ్యంగా తీసుకుని అల్లుకున్న కథ ఇది. చాలా బాగా వచ్చింది. బాలయ్య అభిమానులకు విందు భోజనంలా ఉంటుంది. పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ఇది విన్న వాళ్లకు విషయం అర్దమవుతోంది. యుపిలో జరిగే ఈ కథ ఖచ్చితంగా ఆకట్టుకుంటుదంటున్నారు.  ‘జైసింహా’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి.  
 
నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: సి.కల్యాణ్, కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు, కథ: పరుచూరి మురళి, మ్యూజిక్: చిరంతన్ భట్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆర్ట్: చిన్నా, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు, కొరియోగ్రఫీ: జానీ, ప్రేమ్ రక్షిత్.