హిట్, ఫ్లాఫ్ లకు అతీతంగా ఎదిగాడు బాలయ్య. వరస రెండు ఫ్లాఫ్ లు వచ్చినా ఆయన తన రెమ్యునేషన్ ని పెంచేసాడే తప్ప వెనకడుగు వెయ్యలేదు. తన సినిమాకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, తన ఫ్యాన్స్ సాక్షిగా చెప్తూ బాలయ్య  ఈ  రెమ్యునేషన్ పెంచారని సమాచారం. బాలయ్య, సి కళ్యాణ్ కాంబినేషన్ లో గత సంవత్సరం వచ్చిన జై సింహా చిత్రానికి ఆరు కోట్లు మాత్రమే తీసుకున్న ఆయన ఇప్పుడు 12 కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు తర్వాత బాలయ్య మార్కెట్ పరిస్దితి బాగోలేదు. దాంతో రెమ్యునేషన్ తగ్గిస్తాడేమో అనుకుంటే రెట్టింపు చేసి ట్విస్ట్ ఇచ్చారు.  ఈ నేపధ్యంలో నిర్మాత కళ్యాణ్ ...ఆ ఎమౌంట్ ఎడ్జెస్ట్ చేయటం కోసం మిగతా డిపార్టమెంట్ లో కోతలు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు.  దాంతో సినిమాకు పనిచేసిన మిగతా టీమ్ మింగలేక..కక్కలేక అన్నట్లుగా ఇచ్చిన డబ్బుని తీసుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

బాలయ్య సినిమా కాదనే ధైర్యం లేదని, అలాగని తమ రెమ్యునేషన్స్ తగ్గించేస్తే చూస్తూ ఊరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేకపోయామని అంటున్నారట. అయితే ఈ విషయం బాలయ్యకు తెలియకపోవచ్చు అంటున్నారు. నిజమెంతో కానీ ఈ విషయం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం 2018 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ కలయికలో రూలర్  చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలయ్య - కె.ఎస్‌ రవికుమార్‌ మరోసారి కలసి పనిచేస్తున్నారు.  బాలయ్య ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడు.

రీసెంట్ గా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.  బాలయ్య పవర్ ఫుల్ పోలీస్‌గా చేతిలో సుత్తితో  ఉన్న లుక్‌‌కి రెస్పాన్స్ బాగుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’గా బాలయ్య థియోటర్స్ లో దిగనున్నాడు.

వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌ కాగా భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కథ : పరుచూరి మురళి, మాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్.