నందమూరి బాలకృష్ణ కు ఈ ఏజ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. హిట్ లు లేక ఆయన వెనక బడ్డాడు కానీ ఒకటి సరైన సినిమా పడితే ఆయన ఫామ్ లోకి వచ్చేస్తారనేది నిజం. అందుకోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ  అదే సమయంలో బాలయ్య తీసుకునే నిర్ణయాలు వాళ్లను కంగారుపెడుతున్నాయి. ఏరి కోరి అవుట్ డేటెడ్ డైరక్టర్స్  ని ఆయన తెచ్చి పెట్టుకోవటం అందరికీ బాధ కలిగిస్తోంది.

స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా అనగానే ఎనభైల్లోనో, తొంబైల్లోనో ఆగిపోయిన సినిమా అని అందరికీ అర్దమైంది. చాలా మంది బాలయ్య ఏంటి రవికుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమేంటి అనుకున్నారు. అనుకున్నంతా అయ్యింది. రూలర్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మరో అవుట్ డేటెడ్ డైరక్టర్ కు ఆయన గ్నీన్ సిగ్నల్ ఇఛ్చేందుకు సిద్దపడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆయన మరెవరో కాదు బి.గోపాల్. బాలయ్యకు ఒకప్పుడు సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి హిట్స్ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆయన ఆగిపోయారు. చాలా కాలంగా బాలయ్య తో సినిమా చేస్తానంటూ కథలు వింటూ వస్తున్నారు. అయితే ఆయనకు ఏ కథా నచ్చటం లేదు. నచ్చిన కథలు బాలయ్యకు ఎక్కటం లేదు. చిట్ట చివరకు బాలయ్యని ఓ కథతో ఒప్పించారని సమాచారం.  

2002 లో వచ్చిన ఇంద్ర తర్వాత హిట్ లేని బి.గోపాల్ రీసెంట్ గా గోపీచంద్ తో ఆరడుగుల బుల్లెట్ అంటూ 2017 ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు.  ఇప్పుడు అదే బి.గోపాల్ తో బాలయ్య సినిమా చేయటానికి ఉత్సాహం చూపించటం అందరికీ షాక్ ఇస్తోంది. ముఖ్యంగా అభిమానులు బాహాటంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే బాలయ్య పై తమ అభిమానాన్ని చూపుతూ..బాలయ్య ఆలోచించడా..రూలర్ డిజాస్టర్ అయ్యాక కూడా తెలుసుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఓ కొత్త రచయిత చెప్పిన లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ తో ఈ సినిమా ఉండే అవకాసం ఉందిట. ప్రస్తుతం బాలయ్య...తనకు హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా చేస్తున్నారు.