సాధారణంగా హీరోలు కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు, వరస హిట్స్ వచ్చినప్పుడు తమ రెమ్యునేషన్ ని పెంచుతూంటారు. కానీ బాలయ్య అందరికన్నా విభిన్నం గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా తన తండ్రి బయోపిక్ లుగా వచ్చిన ఎన్టీఆర్ కథ నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ అయి,కొత్త చిత్రం చేస్తున్న ఈ టైమ్ లో తన రెమ్యునేషన్ ని పెంచారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం అంతకు ముందు తీసుకునే రెమ్యునేషన్ కు రెట్టింపు డిమాండ్ చేస్తున్నారట.

సాధారణంగా బాలయ్య ఒక సినిమాకు ఐదు నుంచి ఏడు  కోట్లు దాకా తీసుకుంటారు. అయితే కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న  ఈ సినిమా కోసం ఆయన పది కోట్లు దాకా డిమాండ్ చేసి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.  డిసెంబర్ 20 న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ  సినిమా కోసం బాలయ్య రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రకరకాల గెటప్స్ ట్రై చేస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా ..బాలయ్య రెమ్యునేషన్ పెంచటంతో బడ్జెట్ సమస్యలు రాకుండా ఉండటం మిగతా చోట్ల కోత పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జైసింహా' తర్వాత ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. బాలయ్యకు 105వ చిత్రమిది. ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.